: పారిస్ దాడి చేసిన ఓ ముష్కరుడి ఆఖరి ఎస్ఎంఎస్ ఇదే!
ఇటీవల ఫ్రాన్స్ రాజధాని పారిస్ పై దాడిని జరిపి 130 మందికి పైగా మరణానికి కారణమైన ఉగ్రవాదుల్లో సామీ ఆర్మీమూర్ (28) అనే వ్యక్తి చివరిగా తన కుటుంబానికి పంపిన ఎస్ఎంఎస్ గురించిన సమాచారం వెల్లడైంది. తన సోదరికి పంపిన ఎస్ఎంఎస్ లో త్వరలోనే మిమ్మల్ని కలుస్తానని చెప్పాడు. వారి పెంపుడు పిల్లిపై తన ప్రేమను చూపాడు. బాటక్లాన్ థియేటర్ లో జరిపిన దాడిలో సామీ పాలు పంచుకున్నాడు. దాదాపు 12 మందిని హతమార్చిన ఇతను ఒంటికి కట్టుకువచ్చిన బాంబులను పేల్చుకుని మరణించాడు. ఇటువంటి ఉగ్రదాడుల్లో తన సోదరుడు ఉంటాడని ఊహించలేదని అతని సోదరి వ్యాఖ్యానించినట్టు 'మెయిల్ ఆన్ లైన్' వెల్లడించింది. "మాకు మేము రోజూ ప్రశ్నించుకుంటున్నాం. ఏం జరిగింది? ఎందుకు మేము కలిసి పెరిగాం? కానీ, మా దారులు ఇలా ఎందుకు విడిపోయాయి?" అని ఆమె అంటోంది.