: ఉత్తర కామెరూన్ లో మహిళల ఆత్మాహుతి దాడి... ఐదుగురి మృతి


ఇద్దరు మహిళలు ఒంటికి బాంబులు చుట్టుకుని వచ్చి తమను తాము పేల్చేసుకోవడంతో వారిద్దరు సహా ఏడుగురు మరణించిన ఘటన ఉత్తర కామెరూన్ లో జరిగింది. సాయంత్రం 6 గంటలకు (భారత కాలమానం ప్రకారం నేటి తెల్లవారుఝామున 4 గంటలకు) దబంగా నగరంలో ఈ సంఘటన జరిగిందని కామెరూన్ గవర్నర్ మిజియవా బకారీ వెల్లడించారు. ఆత్మాహుతి దాడి సభ్యులు నైజీరియాకు చెందిన ఇస్లామిస్టు గ్రూప్ బోకో హరామ్ కు చెందిన వారని తెలిపారు. తొలి మహిళ ఓ ఇంటిపై దాడి చేసి తనను తాను పేల్చుకోగా, మరో మహిళ ఓ వెల్డింగ్ షాపు వద్ద దాడి చేసిందని తెలిపారు. ఈ పేలుళ్లలో మరో 10 మందికి పైగా గాయపడ్డారని, వారిని ఆసుపత్రులకు తరలించామని వివరించారు. కాగా, దబంగా పట్టణంలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేయడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News