: అభివృద్ధిలో ఏపీకి అంత సీనుందా?: యనమల సందేహానికి చంద్రబాబు సమాధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీ వృద్ధిపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఓ సందేహాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ఆర్థిక సంవత్సరమైన 2016-17లో 15 శాతం వృద్ధి రేటును చేరేలా చూడాలంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించిన వేళ, ఆ రేటు సాధించడం సాధ్యమేనా? అంటూ యనమల ప్రశ్నించారు. ఆపై జీడీపీ విషయంలో ఇరువురి మధ్యా ఆసక్తికర చర్చ జరిగినట్టు తెలుస్తోంది. వృద్ధి లక్ష్యం మరీ ఎక్కువగా ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దీన్ని అందుకోవడం ఏమంత సులువుకాదని యనమల అభిప్రాయపడగా, ఓ టార్గెట్ ఫిక్స్ చేసుకుని దాని కోసం పనిచేస్తే మంచిదేగా? అని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు సమాచారం. వృద్ధి రేటును సాధ్యమైనంత పైకి తీసుకువెళ్లాలన్నదే తన అభిమతమని, అందుకోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు.