: మన ఉగ్రవాదుల భ్రమలు తొలగాయి...వెనక్కు రావడానికి రెడీ!


ఐఎస్ఐఎస్ తో జతకట్టి ఇస్లామిక్ రాజ్య స్థాపనకు సహకరించాలని వెళ్లిన భారతీయుల భ్రమలు తొలగిపోయాయని, ఇండియా నుంచి వెళ్లిన వారు ఉగ్రవాదుల నుంచి తప్పించుకుని వెనక్కు వెళ్లాలని భావిస్తున్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. జీహాద్ బాట పట్టిన భారతీయ ముస్లిం యువత సిరియా తదితర ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతోందని, విదేశాల నుంచి వచ్చిన వారిని యుద్ధంలో ముందు నిలిపి, తొలుత వారినే బలి చేస్తున్న ఐఎస్ఐఎస్ విధానాలు వీరికి ఎంతమాత్రమూ నచ్చడం లేదని కేంద్ర హోం శాఖకు ఇచ్చిన తాజా నివేదికలో ఐబీ వెల్లడించినట్టు సమాచారం. సిరియా వెళ్లిన వారు వెనక్కు రావాలని అనుకుంటున్నట్టు తమతమ కుటుంబ సభ్యులకు తెలుపగా, వారి నుంచి పోలీసులకు సమాచారం అందిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఈ నివేదికలో పేర్కొన్నాయి. ఇటీవల పారిపోవాలని చూసిన ఆరుగురు భారతీయులను రాళ్లతో కొట్టి చంపడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందని, ప్రస్తుతం 15 మంది వరకూ భారతీయులు ఐఎస్ఐఎస్ లో పని చేస్తున్నారని నిఘా అధికారులు గుర్తించారు. వీరిలో గుంటూరుకు చెందిన తల్మీజుర్ రెహమాన్, హైదరాబాద్ కు చెందిన అతీఫ్ అహ్మద్ ఖాన్ లతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాల వారూ ఉన్నారు.

  • Loading...

More Telugu News