: బోరుబావిలో పడ్డ చిన్నారి రాకేష్ ఇకలేడు!


మెదక్ పుల్కల్ మండలం బొమ్మారెడ్డి గూడెం తండాలో నిన్న బోరుబావిలో పడ్డ మూడేళ్ల బాలుడు రాకేశ్ మరణించాడు. ఈ ఉదయం బాలుడి మృతదేహాన్ని బయటకు తీయడంతో అతని తల్లిదండ్రులు బైరు సాయిలు, మొగులమ్మ దంపతుల రోదన మిన్నంటింది. దాదాపు 24 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం, స్థానిక అధికారులు బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వేందుకు యత్నించగా, బండరాళ్లు అడ్డుపడ్డాయి. బాలుడు తల్లకిందులుగా ఉన్నాడన్న విషయాన్ని గమనించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాళ్లకు తాడు పెనవేసుకునేలా చేసి, రాకేశ్ ను బయటకు తీశారు. ఆపై బాలుడిని పరీక్షించిన వైద్యులు మరణించాడని వెల్లడించారు.

  • Loading...

More Telugu News