: ఆనాడు రాజీవ్ గాంధీ చేసింది తప్పే!: చిదంబరం


దాదాపు 27 సంవత్సరాల క్రితం, 1988లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ, ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ రాసిన 'ది శటానిక్ వర్సెస్'ను నిషేధించి తప్పు చేశారని ఆనాటి హోం మంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. తనను 20 సంవత్సరాల క్రితం ఈ ప్రశ్న అడిగినా, ఇదే సమాధానం చెప్పుండేవాడినని తెలిపారు. ఆ పుస్తకంపై నిషేధం విధించకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. టైమ్స్ లిటరరీ ఫెస్టివల్ కు హాజరైన ఆయన, దేశంలో అత్యయిక స్థితిని విధించడం కూడా తప్పేనని, తాను చేసిన తప్పును ఇందిర అంగీకరించారని, ఆపై భారత ప్రజలు సైతం ఆమెను ఆదరించారన్న విషయాన్ని మరువరాదని అన్నారు.

  • Loading...

More Telugu News