: అనుష్కకు 'జిమ్ ట్రైనర్'గా రానా!
సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్క త్వరలోనే టాలీవుడ్ గ్రేట్ సినిమా బాహుబలి-2 కన్ క్లూజన్ లో నటించనుంది. ఈ సినిమా కోసం స్వీటీ సన్నగా మారాలి. ఇందుకోసం హీరో రానా ఆమెకు తగిన ఎక్సర్ సైజులు నేర్పుతున్నాడు. అనుష్కతో బాటుగా దర్శకుడు ప్రకాశ్ కోవెల మూడి, ఆయన భార్య కనిక ఈ వ్యాయామాలు నేర్చుకుంటున్నారు. ఈ తమాషా ప్రక్రియను వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టింది అనుష్క. దీనికి అభిమానుల నుంచి ఆదరణ లభిస్తోంది.