: సరదా కోసమే విమానాన్ని హైజాక్ చేస్తానన్నాడట!


ఈ నెల 20న ధానేలోని ఎయిరిండియా కాల్ సెంటర్ కు ఓ వ్యక్తి ఫోన్ చేసి, తాను ఐఎస్ఐఎస్ లో సభ్యుడినని, నవంబర్ 28న ఎయిరిండియాకు చెందిన విమానాన్ని హైజాక్ చేస్తామంటూ ఓ వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఎయిరిండియా అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన దర్యాప్తు అధికారులు ఆ కాల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్టు గుర్తించారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేసిన అధికారులు, హర్థా జిల్లాలోని రహత్ గావ్ అనే గ్రామంలో ఆగంతుకుడిని పట్టుకున్నారు. దీంతో విచారణ చేయగా, సరదా కోసం అలా చేశానని చెప్పాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News