: హృతిక్ రోషన్ అంటే చెప్పలేనంత ఇష్టం!: తమన్నా


కోలీవుడ్, టాలీవుడ్ లలో అగ్రశ్రేణి హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న తమన్నా తాను, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు వీరాభిమానిని అని తెలిపింది. అయితే ఇంత వరకు ఆయనను కలవలేదని చెప్పింది. హృతిక్ తో కలిసి పనిచేయాలన్న తన కల వాస్తవ రూపం దాల్చాలని ఎదురుచూస్తున్నానని పేర్కొంది. హృతిక్ అంటే మాటల్లో చెప్పలేనంత ఇష్టమని తమన్నా వెల్లడించింది. రవితేజాతో ముచ్చట్లు బాగా చెప్తానని చెప్పిన తమన్నా, ప్రభాస్ డార్లింగ్ అయితే, రానా 'హల్క్' అని పేర్కొంది. జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్, అల్లు అర్జున్ ముగ్గురూ అద్భుతమైన డాన్సర్లని తెలిపింది. తనకంటే నాగార్జున గ్లామరస్ పర్సన్ అని, ఆయన కళ్లు చాలా ఊసులు చెబుతాయని తమన్నా చెప్పింది. రజనీకాంత్ తో పని చేయాలన్న ఆశ ఉందని మిల్కీ బ్యూటీ వెల్లడించింది. అనుష్క సినిమాల్లోకి రాకుండా ఉంటే ఎన్జీవో పెట్టుకుని ఉండేదని తమన్నా తెలిపింది.

  • Loading...

More Telugu News