: హైదరాబాదు రోగికి కేరళ యువకుడి గుండె!
గుండె మార్పిడి ప్రక్రియ కోసం హైదరాబాదులోని బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ ను ఆపేసిన సంఘటన చోటుచేసుకుంది. కేరళలోని తిరుచ్చిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ యువకుడి గుండెను యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసరాజు (50) అనే వ్యక్తికి అమర్చేందుకు విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా గుండెను వీలైనంత తొందరగా సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి అంబులెన్సులో చేర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను ఆపేసి, గుండెను ఆసుపత్రికి చేర్చారు. డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహిస్తున్నారు.