: డిసెంబర్ 7న నా నిశ్చితార్థం: వరుణ్ సందేశ్
డిసెంబర్ 7న తన వివాహ నిశ్చితార్థం జరుగుతుందని యువనటుడు వరుణ్ సందేశ్ చెప్పాడు. ఓ టీవీ చానెల్ లో ప్రసారమయ్యే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ నటుడు మాట్లాడుతూ, తన నిశ్చితార్థానికి సంబంధించిన పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తానని చెప్పాడు. డిసెంబర్ లోనే వివాహం కూడా ఉండవచ్చని, అలాగే అదే నెలలో తన సోదరి వివాహం కూడా ఉందని తెలిపాడు. తన కెరీర్ ప్రస్తుతానికి బాగా సాగుతోందని వరుణ్ అన్నాడు. ఈ సందర్భంగా 'హ్యాపీడేస్' సినిమా షూటింగ్ రోజుల్లో జరిగిన సన్నివేశాలను గుర్తు చేసుకున్నాడు.