: అవార్డులపై ఆసక్తి లేదు... అందుకే అవార్డు ఫంక్షన్లకు రాను: రాజమౌళి
అవార్డులపై ఆసక్తి లేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపారు. తన స్నేహితుడు ఆర్దోపిడీషియన్ డాక్టర్ ఏవీ గురవారెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన సందర్భంగా రాజమౌళి కేరళలోని తిరువనంతపురం వెళ్లారు. అక్కడ కేరళ మీడియా పలు ప్రశ్నలు సంధించింది. వాటికి రాజమౌళి సమాధానమిస్తూ, తాను అవార్డు ఫంక్షన్లకు హాజరుకావడం లేదని అన్నారు. అవార్డులకు అంత ప్రాధాన్యత ఉంటుందని భావించడం లేదని ఆయన పేర్కొన్నారు. తన సంగతి పక్కన పెడితే, బాహుబలి సినిమాలో ఇంకెవరికైనా అవార్డు వస్తే సంతోషమేనని రాజమౌళి చెప్పారు. వారికి అది ప్రోత్సాహంగా పని చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, తెలుగు సినిమా నామినేషన్లలో 'బాహుబలి' 14 విభాగాల్లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీకి నామినేట్ అయింది.