: పీటర్ ముఖర్జియాకి లైడిటెక్టర్ పరీక్షలు


షీనా బోరా హత్య కేసులో ప్రముఖ వ్యాపారవేత్త పీటర్ ముఖర్జియాకు సీబీఐ అధికారుల ఆధ్వర్యంలో లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించారు. షీనాబోరా హత్య కేసును విచారిస్తున్న ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో పీటర్ ముఖర్జియాకు ఈ పరీక్షలు నిర్వహించామని అధికారులు వెల్లడించారు. కాగా, షీనా బోరా హత్య కేసులో పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ముఖర్జియాను విచారించిన సందర్భంగా పలు మార్లు వాంగ్మూలమిచ్చిన పీటర్ ముఖర్జియా ఒక్కోసారి ఒక్కోలా తన వాదన వినిపించారు. దీంతో ఆయన వాస్తవం చెబుతున్నారా? లేదా? అనేది నిర్ధారించడం కాస్త కష్టంగా మారింది. దీంతో పీటర్ ముఖర్జియాకు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కోర్టును అనుమతి అడిగారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనకు నేడు ఈ పరీక్ష నిర్వహించారు. సోమవారం ఆయనను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.

  • Loading...

More Telugu News