: టీట్వంటీల్లో అత్యధిక వికెట్లు తీసిన అఫ్రిదీ
పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదీ ఓ ఘనత సాధించాడు. టీట్వంటీల్లో అత్యధిక వికెట్లు తీసిన పాకిస్థాన్ ఆటగాడిగా రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన రెండో ట్వీటంటీలో మూడు వికెట్లు తీయడం ద్వారా సయీద్ అజ్మల్ (85) పేరిట ఉన్న అత్యధిక వికెట్ల రికార్డును తన పేరిట రాసుకున్నాడు. 86 టీట్వంటీలు ఆడిన అఫ్రిదీ 86 వికెట్లు తీసి సత్తా చాటాడు. కాగా, ఇంగ్లండ్ తో జరిగిన రెండో టీట్వంటీలో కేవలం మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన ఇంగ్లండ్ జట్టు 2-0తో ఇంకో టీట్వంటీ మిగిలి ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో అత్యంత సీనియర్ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ కావడం విశేషం!