: రామేశ్వరానికి ఉగ్రవాదుల బెడద... ఐబీ హెచ్చరికలు...తమిళనాడు అప్రమత్తం
రామేశ్వరం తీరం నుంచి దేశంలోకి ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేయడంతో తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం అప్రమత్తం చేసింది. రామేశ్వరం పరిసరాల్లోని తీర ప్రాంతంలో గస్తీని పెంచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనళు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు చెన్నై నుంచి కోస్ట్ గార్డ్ కు చెందిన యుద్ధనౌక రామేశ్వరం తీరంలో పహారాకాస్తోంది. అంతే కాకుండా స్పీడ్ బోట్లలో నౌకాదళ సిబ్బంది గస్తీ కాస్తున్నారు.