: న్యూట్రిషియన్ కచోరీ షాపు పెట్టుకున్న భారత ఆటగాడు
తన ఆటతీరుతో భారత జట్టుకు విజయాలు సాధించిపెట్టి, కెప్టెన్ గా రాణించిన ఓ ఆటగాడు ఇప్పుడు కచోరీ షాపు పెట్టుకోవడం విస్మయానికి గురిచేస్తోంది. 'డెఫ్ అండ్ డమ్' క్రికెట్ వరల్డ్ కప్ భారత్ కు రావడంలో కీలక పాత్ర పోషించిన ఇమ్రాన్ షేక్, ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు గుజరాత్ లోని వడోదరలోని ఓల్డ్ పంద్రా రోడ్డులో న్యూట్రీషియన్ మూంగ్ కచోర్ దాల్ స్టాల్ ను పెట్టుకున్నాడు. క్రికెట్ అంటే తనకు చాలా ఇష్టమని, అయితే కుటుంబ బాధ్యతల నేపథ్యంలో ఆర్థికంగా నిలదొక్కుకోవడం అత్యవసరమని, అందుకే తన భార్య రోజాతో కలిసి మూంగ్ దాల్ కచోరీ షాపు పెట్టుకున్నట్టు ఇమ్రాన్ షేక్ తెలిపాడు.