: రాయలసీమకు చంద్రబాబు మరో అన్యాయం చేశారు: శైలజానాథ్
ఇప్పటికే రాయలసీమకు ఎన్నో రకాలుగా అన్యాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు... ఇప్పుడు మరో అన్యాయం చేశారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. చిత్తూరు జిల్లాకు నీటిని సరఫరా చేసేందుకు ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని అన్నారు. అప్పటి ప్రభుత్వం రూ. 7390 కోట్లను కేటాయించిన పథకాన్ని ఇప్పుడు రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇది రాయలసీమకు అన్యాయం చేయడం కాదా? అని నిలదీశారు. సీమకు రాజధాని రాకుండా చేసిన చంద్రబాబు... ఇలా ఒక్కో పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.