: భారత్ తో చర్చలకు సిద్ధం... షరతులూ పెట్టబోం: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్
భారత్ తో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీప్ ప్రకటించారు. అంతేకాక ఎలాంటి షరతులు లేకుండానే చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. కామన్వెల్త్ దేశాల అధినేతల సదస్సు సందర్భంగా మాల్టా రాజధాని వెన్నెట్టాలో నిన్న బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ తో భేటీ సందర్భంగా షరీఫ్ ఈ ప్రకటన చేశారు. ఒక్క భారత్ తోనే కాక పొరుగు దేశాలన్నింటితో తాము సత్సంబంధాలు కోరుకుంటున్నామని కూడా షరీఫ్ ప్రకటించారు. ఉగ్రవాదంపై ఇప్పటికే తాము ఉక్కుపాదం మోపామని షరీఫ్ పేర్కొన్నారు.