: దక్షిణాది ముస్లింలే ఐఎస్ పట్ల ఆకర్షితులవుతున్నారు: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి రిజిజు


ప్రపంచాన్ని వణికిస్తున్న ఐఎస్ఐఎస్ పట్ల విశ్వవ్యాప్తంగా ఉన్న ముస్లిం యువత ఆకర్షితులవుతోంది. ఇందుకు భారత్ లోని ముస్లిం యువత మినహాయింపేమీ కాదు. అయితే ఆ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులవుతున్న వారిలో దక్షిణాదికి చెందిన ముస్లిం యువతే అధికంగా ఉంటోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. ఇండియాటుడే న్యూస్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీలోని ముస్లిం యువత ఐఎస్ వైపు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఐఎస్ హెచ్చరికలకు తామేమీ బెదిరిపోవడం లేదని చెప్పిన రిజిజు, ఉగ్రవాద సంస్థ దాడులను తిప్పికొట్టే సామర్థ్యం తమకుందని కూడా పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News