: ఎనిమిది మందిని గొంతు కోసి చంపిన డ్రగ్స్ మాఫియా


మెక్సికో... మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ప్రపంచ రాజధానిగా పేరు మోసిన దేశం. ఈ దేశంలో డ్రగ్స్ మాఫియా గ్రూపుల మధ్య నిరంతరం ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. తాజాగా, దక్షిణ మెక్సికోలోని ఆక్సెకా రాష్ట్రం కాసోలాపా పట్టణ శివారులో అత్యంత దారుణంగా హత్యకు గురైన ఎనిమిది మృతదేహాలను స్థానిక రైతులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో, ఓ వ్యాన్ నుంచి ఆరు మృతదేహాలను, దానికి సమీపంలోనే మరో రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని మృతదేహాలకూ కాళ్లూచేతులు కట్టేసి ఉన్నాయి. గొంతులు కోసి వీరిని చంపేశారు. మరో విషయం ఏమిటంటే, ఇప్పటి వరకు మెక్సికోలో మాఫియా చేతిలో హత్యకు గురైన వారు లేదా కనిపించకుండా పోయిన వారి సంఖ్య లక్షకు పైనే ఉంటుందనేది ఓ అంచనా.

  • Error fetching data: Network response was not ok

More Telugu News