: వచ్చే నెలలో హైదరాబాదుకు సత్య నాదెళ్ల...డేటా సెంటర్ ఏర్పాటుపై టీ సర్కారుతో చర్చలు


మైక్రోసాఫ్ట్ సీఈఓ, తెలుగు తేజం సత్య నాదెళ్ల వచ్చే నెలలో హైదరాబాదుకు రానున్నారు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు సంబంధించిన డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకే ఆయన హైదరాబాదు వస్తున్నారు. క్లౌడ్ సేవలకు సంబంధించి డేటా సెంటర్లను భారత్ లోని ముంబై, పుణే, చెన్నైల్లో మైక్రోసాఫ్ట్ ఇటీవలే ప్రారంభించింది. వాస్తవానికి క్లౌడ్ డేటా సెంటర్లలో తొలి కేంద్రాన్ని హైదరాబాదులోనే ఏర్పాటు చేయాలని మైక్రోసాఫ్ట్ తలచింది. ఆ సంస్థకు అప్పటికే ఇక్కడ అవసరమైన స్థలం కూడా ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల హైదరాబాదు కేంద్రం వాయిదా పడగా, మిగిలిన నగరాల్లో మాత్రం ఏర్పాటయ్యాయి. తాజాగా హైదరాబాదులోనూ క్లౌండ్ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయాల్సిందేనని నిర్ణయించుకున్న సత్య నాదెళ్ల, అందులో భాగంగానే హైదరాబాదు పర్యటనకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

  • Loading...

More Telugu News