: కోల్ కతాలో 'ఈఫిల్' టవర్!
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ నగరంలో ఉండే ఈఫిల్ టవర్ కోల్ కతాలో ఉండటమేంటని అనుకుంటున్నారా? ఇది నిజం. ప్రఖ్యాత ఈఫిల్ టవర్ తరహాలో కోల్ కతాలో ఒక నిర్మాణాన్ని చేపడుతున్నారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కోల్ కతా శాటిలైట్ సిటీలోని ఎకో పార్కు వద్ద దీన్ని నిర్మిస్తున్నారు. దీని ఎత్తు 55 మీటర్లు కాగా, 300 టన్నుల ఉక్కును దీని కోసం ఉపయోగించనున్నారు. దీనిపైకి ఎక్కడానికి రెండు భారీ లిఫ్ట్ లను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీనిమీద నుంచి నగరాన్ని వీక్షించడానికి గ్యాలరీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.