: కొలరాడో కాల్పులతో షాక్ కు గురైన ఒబామా... ఘటనపై వివరాలడిగిన అగ్రరాజ్యాధిపతి


అగ్రరాజ్యం అమెరికా గడ్డపై వరుసగా చోటుచేసుకుంటున్న కాల్పులు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ పై ఉగ్రవాదులు విరుచుకుపడిన తర్వాత ఇప్పటికే అమెరికాలో రెండు చోట్ల తుపాకులు గర్జించాయి. నిన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోకి ఓ అగంతుకుడు చొరబడ్డాడు. తాజాగా కొలరాడోలో కాల్పులు చోటుచేసుకోవడంతో ఒబామా షాక్ కు గురయ్యారు. వెంటనే పోలీసు అధికారులతో భేటీ అయిన ఆయన ఘటనకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులకు గాయమైన వైనం ఒబామాను ఆందోళనకు గురి చేసింది. ఈ తరహా ఘటనల వెనుక ఉన్న కారణాలను వెలికితీయడంతో పాటు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా కొలరాడో ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

  • Loading...

More Telugu News