: నాగార్జున వర్సిటీలో మరో కలకలం... మూడు రోజులుగా జాడ లేని విద్యార్థి
ర్యాగింగ్ కు అడ్డాగా మారిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిన్న సాయంత్రం వెలుగుచూసిన మరో ఘటన కలకలం రేపుతోంది. బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న గణేశ్ అనే విద్యార్థి మూడు రోజులుగా కనిపించడం లేదు. కాస్త ఆలస్యంగా సమాచారం అందుకున్న గణేశ్ తల్లిదండ్రులు నిన్న వర్సిటీకి వచ్చి, కుమారుడి అదృశ్యంపై పెదకాకాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్ కు సంబంధించి వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న కళాశాలలో విద్యార్థి గణేశ్ అదృశ్యం కలకలం రేపుతోంది.