: అమెరికాలో కాల్పుల కలకలం... దుండగుడి కాల్పుల్లో ఇద్దరు దుర్మరణం, 9 మందికి గాయాలు


అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. కొలరాడోలో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆయుధం చేతబట్టిన గుర్తు తెలియని దుండగుడు పార్టీలో ఎంజాయి చేస్తున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఐదుగురు పోలీసులతో పాటు మొత్తం తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. కాల్పులు జరిపిన దుండగుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News