: హైదరాబాదులో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు... 9 కార్లు, పెద్ద సంఖ్యలో బైకుల సీజ్


భాగ్యనగరి హైదరాబాదులో డ్రంకన్ డ్రైవ్ కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. నగర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నా, ఇంకా పెద్ద సంఖ్యలో యువత పట్టుబడుతోంది. నిన్న రాత్రి కూడా పోలీసులు నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరిలో ఐదు కార్లతో పాటు ఆరు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా ఫిలింనగర్ పరిధిలో జరిగిన తనిఖీల్లో నాలుగు కార్లు, నాలుగు బైకులు పట్టుబడ్డాయి. మద్యం మత్తులో వాహనాలతో దూసుకువచ్చిన యువకులపై కేసులు నమోదు చేసిన పోలీసులు వాహనాలను సీజ్ చేశారు.

  • Loading...

More Telugu News