: ఎయిర్ కోస్టా నిర్వాకం... చెన్నై ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన తెలుగు ప్రయాణికులు


ప్రైవేట్ విమానయాన సంస్థ ఎయిర్ కోస్టా నిర్వాకంతో వంద మందికి పైగా తెలుగు ప్రయాణికులు తమిళనాడు రాజధాని చెన్నైలోని ఎయిర్ పోర్టులో పడిగాపులు కాయాల్సి వచ్చింది. నేటి ఉదయం చెన్నై నుంచి హైదరాబాదు బయలుదేరాల్సిన ఎయిర్ కోస్టా విమానం ఉన్నపళంగా రద్దైంది. అసలు విమాన సర్వీసును ఏ కారణంగా రద్దు చేశామన్న విషయాన్ని కూడా ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించలేదు. దీంతో చెన్నై నుంచి హైదరాబాదు వచ్చేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన తెలుగు ప్రయాణికులు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఎయిర్ కోస్టా యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రయాణికులు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News