: భారత్ కు ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారు: మార్టీనా హింగీస్


భారత టెన్నిస్ కు ఇద్దరు స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారని ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి మార్టీనా హింగీస్ తెలిసింది. ఆదివారం హైదరాబాదు, ఎల్బీ ఇండోర్ స్టేడియంలో జరగనున్న సీటీఎల్ మ్యాచ్ లో ఆడేందుకు వచ్చిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి దేశంలోనూ టెన్నిస్ లో స్పూర్తిని పెంచేందుకు అంతర్జాతీయ స్ధాయిలో ఆడే ఆటగాడు ఉండడం అవసరమని అన్నారు. అదృష్టవశాత్తు భారత్ కు లియాండర్ పేస్, సానియా మీర్జా రూపంలో ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. సీనియర్లను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు టెన్నిస్ లో రాణించాలని ఆమె సూచించారు. ఈ ఏడాది సీటీఎల్ లో తమ జట్టు విజయం సాధిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. సానియా, పేస్ తో కలిసి విజయాలు సాధించడం గొప్పగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఎక్కడ టెన్నిస్ ఆడినా ఆటను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఆటగాళ్లైన కార్లోవిచ్, థామస్ జోహాన్సన్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News