: షీనా రాజీనామా లెటర్ పై సంతకం పెట్టిన ఇంద్రాణి సెక్రటరీ!


షీనా బోరా హత్య కేసులో దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అధికారులు విచారిస్తున్నారు. అందులో భాగంగా షీనా బోరా పని చేసిన రిలయన్స్ సంస్థకు ఆమె రాజీనామా పత్రాన్ని ఎప్పుడు పంపించారు? ఇందులో సంతకం ఎవరు పెట్టారు? అనేదానిపై ఇంద్రాణి ముఖర్జియా పర్సనల్ సెక్రటరీ కాజల్ శర్మను అధికారులు విచారించారు. షీనా బోరా రాజీనామా పత్రంపై తానే సంతకం పెట్టానని ఆమె అంగీకరించింది. షీనా సంతకం ప్రాక్టీస్ చేసి రిలయన్స్ సంస్థకు పంపాలని ఇంద్రాణి తనను కోరారని, దానికి తాను అంగీకరించలేదని తెలిపారు. అప్పుడు షీనా అమెరికాలో ఉందని, సంస్థ రాజీనామా లెటర్ అడుగుతోందని, వెంటనే చేసి పంపాలని చెప్పారని, దీంతో తన యజమాని చెప్పినట్టు చేశానని ఆమె దర్యాప్తు అధికారులకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News