: ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి, ఇంటర్ మీడియట్ పరీక్షల షెడ్యూల్ ఈరోజు విడుదలైంది. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు పరీక్షల వివరాలను తెలిపారు. వచ్చే మార్చి 21 నుంచి ఏప్రిల్ 7 వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని, పరీక్షా సమయం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలని పేర్కొన్నారు. మార్చి 2 నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు, మార్చి 3 నుంచి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 4 నుంచి 24 వరకు నిర్వహించే ఇంటర్ మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జంబ్లింగ్ విధానంలో ఉంటాయని ఆయన వివరించారు.