: ఆ శక్తి ఒక్క రాజ్యాంగానికే ఉంది!: ప్రధాని నరేంద్ర మోదీ


దేశాభివృద్ధికి అన్ని ప్రభుత్వాలు కృషి చేశాయని, భారత దేశ అభివృద్ధిలో ప్రతి ప్రధాని పాత్ర ఉందన్న విషయాన్ని తాను ఎర్రకోటపై నుంచి ఎన్నడో చెప్పానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజ్యాంగం అంశంపై శుక్రవారం లోక్ సభలో ఆయన మాట్లాడారు. రాజ్యాంగంపై చర్చ కోసం కృషి చేసిన స్పీకర్ కు కృతజ్ఞతలు చెబుతున్నానని, రాజ్యాంగంపై చర్చకు అందరూ ఆసక్తి కనబరిచారని అన్నారు. ‘ఈ సభలో నేనూ ఒక సభ్యుడిని, ఈ అంశంపై నా ఆలోచనలు ప్రస్తావిస్తా’ అని అన్నారు. రాజ్యాంగం అనేది ఒక సాధారణ పదం కాదని, భారతీయుల ఐక్యతకు, గౌరవానికి ఇది ప్రతీక అని పేర్కొన్నారు. రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. జాతి మొత్తాన్ని ఏకతాటిపై నిలిపే శక్తి ఒక్క రాజ్యాంగానికే ఉందన్నారు. రాజ్యాంగ నిర్మాణం వెనుక మహనీయుల దూరదృష్టిపై చర్చించాము, భారత్ లాంటి రాజ్యాంగాన్ని రూపొందించడం అంత తేలికైన విషయం కాదన్నారు.

  • Loading...

More Telugu News