: గుండెపోటుతో టెక్కీ మృతి... తట్టుకోలేక బిల్డింగ్ పై నుంచి దూకేసిన భార్య
భర్త ఆకస్మిక మృతిని తట్టుకోలేకపోయిన భార్య ఆత్మహత్య చేసుకుని తను కూడా తనువు చాలించింది. దీంతో వారి ఐదేళ్ల చిన్నారి అనాధగా మారింది. వివరాల్లోకి వెళ్తే ఢిల్లీలోని నోయిడాలో అనురాగ్ అగర్వాల్ (39) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆయనకు గుండె నొప్పి రావడంతో ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ వార్త విన్న అతని భార్య మోనిక (36) లారెల్ లోని తన నివాసానికి వెళ్లి 8వ అంతస్తులోని బాల్కనీపై నుంచి కిందికి దూకి, గాయాల పాలై... భర్త చికిత్స పొందిన ఆసుపత్రిలోనే తనూ మృతి చెందింది. దీంతో వారి ఐదేళ్ల కుమార్తె అనాధగా మారడంతో, అక్కడి వారిని ఈ సంఘటన కంటతడి పెట్టించింది.