: పీఓకేపై ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు... బీజేపీ ఫైర్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) ఆ దేశంలో అంతర్భాగంగానే ఉంటుందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీవోకే పాకిస్థాన్ లోనే ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు. యుద్ధంతో కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకోలేమని... కేవలం చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. పాకిస్థాన్ అధీనంలో ఉన్న కాశ్మీర్ ఆ దేశ సొంత భూభాగం కాదని... ఆక్రమించుకున్నదని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్కే సింగ్ మండిపడ్డారు. 1994లో కాశ్మీర్ సమస్యపై పార్లమెంటులో ఏకగ్రీవ తీర్మానం చేశారని... ఈ విషయాన్ని ఫరూక్ అబ్దుల్లా మర్చిపోరాదని అన్నారు.