: గిరగిరా తిప్పిన అశ్విన్ కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'


తన ఐదు వేళ్లతో ఎరుపు రంగు బంతిని గిరగిరా తిప్పుతూ రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 12 వికెట్లు తీసిన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 4 టెస్టుల సిరీస్ లో ఇండియా 2-0 ఆధిక్యంతో నిలిచి సిరీస్ ను కైవసం చేసుకోగా, పిచ్ లను తీర్చిదిద్దిన తీరు అసంతృప్తిని కలిగించిందని, మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా దక్షిణాఫ్రికా కెప్టెన్ హషీమ్ ఆమ్లా వ్యాఖ్యానించారు. భారత్ లో పర్యటన తమకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నాడు. భారత ఆటగాళ్లు టెస్టు సిరీస్ లో అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. ఇండియాలో టెస్టు మ్యాచ్ లు ఆడినా ప్రేక్షకులు అధిక సంఖ్యలో రావడం ఆటగాళ్లకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుందని అన్నాడు. టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకోలేకపోయినప్పటికీ, టెస్టు సిరీస్ లో మంచి ప్రతిభను కనబరుస్తూ సాగుతుండటం సంతోషకరమని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. తదుపరి మ్యాచ్ లో సైతం ఇదే విధమైన ఆటతీరును ప్రదర్శిస్తామన్న నమ్మకముందని వివరించాడు.

  • Loading...

More Telugu News