: జగన్ అమాయక నటనను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు: యనమల


వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అమాయక నటనను నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, శ్వేత పత్రం అంటేనే వాస్తవాలు వెల్లడించడం అని ప్రతిపక్ష నేత అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రజలను మభ్యపెట్టి అమాయకత్వం నటించాలని జగన్ చూస్తున్నారని, ఆయన పప్పులు ఉడకవని ఆయన తెలిపారు. ఇకనైనా జగన్ తన ధోరణి మార్చుకోవాలని ఆయన సూచించారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News