: ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే టీఆర్ఎస్ గెలిచింది: సర్వే
వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం నిజమైన ప్రజా తీర్పు కాదని కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన సర్వే సత్యనారాయణ అన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లను ట్యాపంరింగ్ చేసి, టీఆర్ఎస్ గెలుపొందిందని ఆరోపించారు. కేవలం ఈ మోసం వల్లే టీఆర్ఎస్ కు అంత మెజార్టీ వచ్చిందని, తాను ఓడిపోయానని చెప్పారు. ఈవీఎంలపై బహిరంగ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఎలాంటి అవకతవకలు జరగలేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కు తాను సలాం చేస్తానని అన్నారు. వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే మంత్రులను అనేక చోట్ల ప్రజలు నిలదీశారని ఎద్దేవా చేశారు.