: జీఎస్ టీ బిల్లు పాసవుతుందన్న నమ్మకం ఉంది: సహాయ మంత్రి జయంత్ సిన్హా
జీఎస్ టీ బిల్లు ఆమోదం పొందుతుందన్న నమ్మకం తమకు ఉందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా అన్నారు. ఈ బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ పార్టీ ససేమిరా అంటున్న తరుణంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బిల్లు కు సంబంధించి విపక్షాలు చేసిన సూచనలు, సలహాలను స్వీకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏకాభిప్రాయ సాధన ద్వారా బిల్లు త్వరలో ఆమోదం పొందుతుందని జయంత్ సిన్హా అభిప్రాయపడ్డారు.