: దుమ్మురేపిన పిచ్ పై 'ఏడే'సిన అశ్విన్... గెలిచిన ఇండియా
నాగపూర్ లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్టు మ్యాచ్ లో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించింది. దుమ్మురేగుతున్న పిచ్, స్పిన్ బౌలింగ్ కు పూర్తిగా సహకరించడంతో, ఉపఖండపు స్పిన్ పిచ్ లపై పెద్దగా అనుభవం లేని సౌతాఫ్రికా ఆటగాళ్లు తెల్లమొహం వేశారు. రెండో ఇన్నింగ్స్ లో 310 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు 89.5 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది. ప్లెసిస్, ఆమ్లాల చెరో 39 పరుగులు మినహా మరెవరూ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్ కు 7 వికెట్లు లభించగా, మిశ్రాకు 3 వికెట్లు లభించాయి.