: భార్యను చంపేసి, ఫోటోలు తీసి ఫేస్ బుక్ లో పెట్టాడు!


భార్య తనతో గొడవపడి తనను కొట్టిందని ఆగ్రహించిన భర్త ఆమెను కాల్చి చంపి, ఆ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి, బుక్కైన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఫ్లోరిడాకు చెందిన డెరెక్ మెడీనా అనే వ్యక్తి తన భార్య జెన్నిఫర్ అల్ఫోన్సాతో గొడవపడ్డాడు. ఈ సమయంలో ఆగ్రహం పట్టలేకపోయిన జెన్నిఫర్ తన భర్త డెరెక్ పై చేయిచేసుకుంది. దీనిని అవమానంగా ఫీలైన డెరెక్ వెంటనే ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె ఫోటోలను తీసి ఫేస్ బుక్ లో పోస్టు చేసి, వాటి కింద 'నా భార్యతో గొడవపడ్డాను, ఆమె నన్ను కొట్టింది. అవమానంతో ఆమె ముందు నిలువలేను. అందుకే ఆమెను కాల్చి చంపాను' అంటూ కామెంట్ పెట్టాడు. ఇది పోలీసులకు చేరడంతో డెరెక్ ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు నిలబెట్టారు. దీంతో కోర్టు డెరెక్ కు 25 సంవత్సరాల కఠిన కారాగారశిక్ష విధించింది.

  • Loading...

More Telugu News