: ఆనం సోదరులను సాదరంగా ఆహ్వానిస్తున్నాం: సోమిరెడ్డి
తెలుగుదేశం పార్టీకి, తమ అధినేత చంద్రబాబుకు విధేయులుగా ఉన్న ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానిస్తామని ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీడీపీలోకి ఆనం సోదరులు రావడాన్ని స్వాగతిస్తున్నామని, సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో వైకాపా అధినేత జగన్ పై సోమిరెడ్డి మండిపడ్డారు. వరంగల్ ఉప ఎన్నికలో ఐదో స్థానంలో నిలిచిన వైకాపాకు ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పరిస్థితి పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రాని ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదని అన్నారు. జగన్ చేపడుతున్న పర్యటనలన్నీ జనాలను రెచ్చగొట్టడానికే అని విమర్శించారు.