: ప్రజల ఒత్తిడి మేరకే ప్రధాని మీటింగ్ పెట్టారు!: రాహుల్ గాంధీ


గత్యంతరం లేని పరిస్థితులలోనే ప్రభుత్వం జీఎస్టీ బిల్లు విషయంలో చర్చించడానికి తమ నాయకులను పిలిచిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. "ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకే ప్రధాని ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇది పధ్ధతి కాదు" అన్నారు రాహుల్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలను జీఎస్టీ బిల్లు విషయంలో చర్చించే నిమిత్తం ఈ సాయంకాలం ప్రధాని తన నివాసానికి తేనేటి విందుకు ఆహ్వానించిన సంగతి విదితమే. ప్రధాని ఆహ్వానంపై చర్చించడానికి మన్మోహన్, సోనియా, రాహుల్ ఈ మధ్యాహ్నం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మీడియాతో ఆ విధంగా మాట్లాడారు.

  • Loading...

More Telugu News