: ఉత్కంఠకు తెర, కొరుకుడు పడని ఆమ్లా, ప్లెసిస్ ఔట్
భారత బౌలర్లను దాదాపు రెండు గంటలకు పైగా పరీక్షించిన భాగస్వామ్యానికి తెరపడింది. దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు ఆమ్లా, ప్లెసిస్ ల 72 పరుగుల భాగస్వామ్యానికి తెరదించుతూ, అమిత్ మిశ్రా ఆమ్లా (39) వికెట్ ను దక్కించుకోగా, ఆపై రెండు ఓవర్లలోనే మిశ్రా ప్లెసిస్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా జట్టులో ప్రధాన బ్యాట్స్ మెన్లంతా పెవీలియన్ కు చేరగా, ఇక టెయిలండర్లు మిగిలినట్లయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 74 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు కాగా, విజయానికి ఇంకో 169 పరుగులు చేయాల్సి వుంది. భారత్ నాలుగు వికెట్లు తీస్తే చాలు.