: ముస్లిం పర్సనల్ లా బోర్డుతో దేశ సమగ్రతకు ముప్పు: అరుణ్ జైట్లీ


మతాల ఆధారంగా ఏర్పాటైన లా బోర్డులపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు సహా ఇతర మతాలకు చెందిన ఉన్నత సంస్థలతో దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లుతోందని ఆయన అన్నారు. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో మాట్లాడుతూ, అరుణ్ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. మతం ఆధారంగా జరిగే విభజనను రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సైతం తిరస్కరించారని గుర్తు చేశారు. మతాల ఆధారంగా ఉండే చట్టాల వల్ల రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం సాధ్యపడదని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News