: రాజ్ నాథ్ తో ఏపీ డీజీపీ భేటీ... సుజనా, కంభంపాటి కూడా!


ఏపీ డీజీపీ జేవీ రాముడు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కొద్దిసేపటి క్రితం కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావులు వెంటరాగా కేంద్ర హోం మంత్రితో రాముడు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర విభజన తర్వాత అటు తెలంగాణలోనే కాక ఇటు ఏపీలోని విశాఖ మన్యంలోనూ నిషేధిత మావోయిస్టులు బలం పుంజుకుంటున్న క్రమంలో జరిగిన ఈ భేటీపై ఆసక్తి నెలకొంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రం ఇతోధికంగా నిధులిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున బలగాలతో పాటు ఇతర మౌలిక సదుపాయాల అవసరం ఉంది. వీటన్నింటిపై రాముడు కేంద్ర హోం మంత్రితో చర్చించినట్లు సమాచారం.

  • Loading...

More Telugu News