: ధోనీ మరో రికార్డ్... విదేశీ కంపెనీతో భారీ ఎండార్స్ మెంట్


టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ధోనీ మరో రికార్డు సృష్టించాడు. ఇంతవరకు దేశీయ కంపెనీలతోనే ఎండార్స్ మెంట్లు చేసుకున్న ధోనీ... తొలిసారి ఓ విదేశీ కంపెనీతో భారీ ఎండార్స్ మెంట్ కుదుర్చుకున్నాడు. ధోనీతో దుబాయ్ కు చెందిన 'గ్రాండ్ మిడ్ వెస్ట్ గ్రూప్' ఒప్పందం కుదుర్చుకుంది. మూడు సంవత్సరాల పాటు తమ కంపెనీకి ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తాడని సదరు కంపెనీ నేడు ప్రకటించింది. ఈ కంపెనీకి దుబాయ్, ఐర్లాండ్, యూకే దేశాల్లో పలు రకాల హోటల్ వ్యాపారాలు ఉన్నాయి. యూఏఈలో స్థానిక క్రికెట్ టీమ్ ను కూడా కొనుగోలు చేసింది. తాజాగా ఎంటర్ టైన్ మెంట్ బిజినెస్ ద్వారా ఇండియాలోకి ప్రవేశించేందుకు సన్నాహకాలు చేసుకుంటోంది. మరోవైపు, ఓ ప్రముఖ విదేశీ కంపెనీతో కలసి పని చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ధోనీ తెలిపాడు. అయితే, ఎండార్స్ మెంట్ విలువ ఎంతో ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News