: ఎర్రవల్లి ఫాం హౌస్ లో కేసీఆర్ దంపతులు... చండీయాగం పనుల వద్ద హవన పూజలు
టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి సమయం దగ్గరపడుతోంది. తన సొంత జిల్లా మెదక్ లోని జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం వద్ద కేసీఆర్ వచ్చే నెల 23 నుంచి చండీయాగాన్ని చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అక్కడ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో నేటి ఉదయం అక్కడకు తన సతీమణితో కలిసి వెళ్లిన కేసీఆర్ చండీ హవన పూజలు చేశారు. పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలోనే కేసీఆర్ దంపతులు హవన పూజలు చేసినట్లు తెలుస్తోంది. తాను చేపట్టనున్న చండీయాగానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని కూడా ఆహ్వానించనున్నట్లు కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.