: దొంగగారు మరో 'సారీ' చెప్పారు!


ఒకసారి ఒక ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు... సహజంగా మళ్లీ ఆ ఇంటివైపు చూడరు. కానీ, ఈ దొంగ రూటే సపరేటు. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్డు నెంబర్ 14 లోని బీఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉండే ప్రదీప్ అనే వ్యాపారి ఇంట్లో సదరు దొంగ గత నెల 31న దొంగతనం చేశాడు. బెడ్ రూమ్ లోని బీరువాలో ఉన్న అమెరికా డాలర్లు, ఆభరణాలు, ఖరీదైన సెల్ ఫోన్లు, కెమెరాలను ఎత్తుకుపోయాడు. పోతూ పోతూ 'దొంగతనం చేసినందుకు క్షమించండి... సారీ' అని గోడమీద రాసి వెళ్లాడు. ఇదే దొంగ బుధవారం రాత్రి మళ్లీ ప్రదీప్ ఇంట్లో ప్రవేశించాడు. బంగారు ఆభరణాలు, రూ. 6 వేలు ఎత్తుకుపోయాడు. గతంలో ఎక్కడైతే సారీ అని రాశాడో... మళ్లీ అక్కడే ఇంకోసారి సారీ అని రాశాడు. దీంతో, ప్రదీప్ పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్థలంలో ఆధారాలను క్లూస్ టీమ్ సేకరించారు. ఆధారాలను బట్టి రెండు దొంగతనాలు ఒక దొంగే చేశాడని పోలీసులు నిర్ధారించారు. దొంగ కోసం గాలింపు చర్యలను ప్రారంభించారు.

  • Loading...

More Telugu News