: 516 కాల్స్ లో 102 ‘ఓటుకు నోటు’వేనట!... సెబాస్టియన్ ఫోన్ సంభాషణపై ఫోరెన్సిక్ నివేదిక


తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన ఓటుకు నోటు కేసులో నిన్న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ నివేదిక పలు ఆసక్తికర అంశాలను వెల్లడి చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేసేందుకు టీ టీడీపీ చేసిన యత్నం ఆ పార్టీని ఇరకాటంలోకి నెట్టేసింది. తెలంగాణ అసెంబ్లీలో టీ టీడీఎల్పీ ఉపనేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ కేసులో స్టీఫెన్ సన్ కు డబ్బులిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఈ వ్యవహారంలో పలువురితో సంప్రదింపులు జరిపిన ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా ఆ తర్వాత అరెస్టయ్యారు. ఇక ఈ కేసులో కీలక సాక్ష్యాలుగా పరిగణిస్తున్న ఆడియో, వీడియో టేపులను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు పూర్తి వివరాలతో నిన్న నివేదికను అందజేశారు. ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించారని భావిస్తున్న క్రైస్తవ సంఘాల నేత సెబాస్టియన్ ఫోన్ నుంచి 516 కాల్స్ లభ్యం కాగా, వాటిలో 102 కాల్స్ ఓటుకు నోటు కేసుకు సంబంధించినవే ఉన్నాయట.

  • Loading...

More Telugu News