: ఆరెస్సెస్...దేశంలోనే నెంబర్ వన్ ఉగ్రవాద సంస్థ: మహారాష్ట్ర మాజీ పోలీసధికారి కామెంట్


మహారాష్ట్ర పోలీసు శాఖలో ఐజీ స్థాయి అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన పోలీసు అధికారి ఒకరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విధ్వంసక చర్యలకు పాల్పడిన ఆరెస్సెస్ ముమ్మాటికీ ఉగ్రవాద సంస్థేనని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఎస్ఎం ముష్రిఫ్ కుండబద్దలు కొట్టారు. నిన్న కోల్ కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముష్రిఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆరెస్సెస్ ను ఉగ్రవాద సంస్థగా అభివర్ణించిన ఆయన దేశంలోనే నెంబర్ వన్ ఉగ్రవాద సంస్థగా ఆరెస్సెస్ అపఖ్యాతి మూటగట్టుకుందని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులోని మక్కా మసీదు పేలుళ్లతో పాటు మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుళ్లు, సంఝౌతా ఎక్స్ ప్రెస్ పై బాంబు దాడి లాంటి 13 విధ్వంసాలకు ఆరెస్సెస్ పాల్పడిందని ముష్రిప్ పేర్కొన్నారు. ఆర్ డీఎక్స్ ను వినియోగించిన సంస్థగానూ ఆరెస్సెస్ పై కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందన్న విషయాన్ని ఏమాత్రమూ లెక్కచేయని ఆరెస్సెస్ విధ్వంసాలకు పాల్పడిందని ముష్రిఫ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News