: తార్నాక ఫ్లై ఓవర్ పై ప్రమాదం... భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాదులోని తార్నాక ఫ్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఫ్లై ఓవర్ పైకి వేగంగా వచ్చిన ఓ వాహనం అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో, ఒక్కసారిగా ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగనప్పటికీ, ట్రాఫిక్ జామ్ తో వాహనదారులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.